24 C
Hyderabad
Sunday, August 2, 2026

బామ్మర్ది సేఫ్

Must read

📰 Generate e-Paper Clip

. గుడ్డును గుట్టుగా దాచిన బావ

. రూ.12 కోట్లు పెట్టుబడిన పెట్టిన బాధితులు చక్కర్లు

నిజామాబాద్, బతుకమ్మ: ‘రియల్’ లాభాల ఆశ చూపి రూ.12 కోట్లు వసూలు చేసిన గుడ్డును అతడి బావ సేఫ్ గా దాచినట్లు  సమాచారం. తాను చేసే వెంచర్ లో పెట్టుబడులుపెడితే ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేయించి ఇవ్వడంతోపాటు ప్రతి నెలా డబ్బులు ఇస్తానని గుడ్డు చెప్పడంతో నమ్మిన అమాయకులు కోట్లాది రూపాయలు అతడి చేతిలో పెట్టారు. తమ డబ్బులు తీసుకుని మాయమైన గుడ్డు ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ నగరంలోని బర్కత్ పురాకు చెందిన గుడ్డు కనిపించకుండాపోయి పది రోజులు గడిచిపోయింది. నిజామాబాద్ నగరానికి చెందినవారితోపాటు ఆర్మూర్ తదితర ప్రాంతాలకు చెందిన సన్నిహితులు, పరిచయస్తుల వద్ద నుంచి గుడ్డు సుమారు రూ.12కోట్లు వసూలు చేశాడు. ఒకరికి తెలియకుండా ఒకరి నుంచి అధిక వడ్డీ ఆశచూపి వసూలు డబ్బులు చేశాడు. మొదట్లో తీసుకున్న డబ్బులకు ప్రతినెలా వడ్డీ అధికంగా ఇవ్వడంతో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోయినా పెట్టుబడి  పెట్టేందుకు అందరూ ముందుకు వచ్చారు. అదే స్థాయిలో ప్రతి నెలా వడ్డీ ఇస్తుండడంతో చాలా మంది తాము దాచుకున్న డబ్బులతోపాటు వ్యాపారంలోని డబ్బులను గుడ్డు చేతిలో పెట్టారు. కొందరు మహిళలు తమ భర్తలకు తెలియకుండానే డబ్బులు ఇవ్వడం గమనార్హం. అక్టోబర్ నెలకు సంబంధించిన డబ్బుల కోసం గుడ్డును సంప్రదించడంతో రేపుమాపు అని తిప్పి కనిపించకుండాపోయాడు. గుడ్డును ఆయన బావ అయిన అధికార పార్టీ నాయకుడు అదే పార్టీలోని ముఖ్య నాయకుడి సహకారంతో నిజామాబాద్ నుంచి వేరే ప్రాంతానికి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలివిగా గుడ్డు మిస్సింగ్ అంటూ కేసు నమోదు చేయించినట్లు బాధితులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా  బామ్మర్దిని తప్పించేందుకు బావ అరకోటి రూపాయలు తీసుకున్నాడని మైనార్టీ ఏరియాలో అంతా కోడై కూస్తోంది. బాబాయ్ బడా లీడర్ కావడంతో తాము ఏం చేసినా చెల్లుతుందని ఇతరుల దగ్గర అధిక వడ్డీ పేరుతో వసూల్ చేసిన బామ్మర్దిని కాపాడేందుకే బావ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. గుడ్డు ఆచూకీ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న బాధితులు అతడు చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గుడ్డు రాసిచ్చిన ప్రామిసరీ నోట్ లు , చెక్కులు ఉన్న వారు ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉండడంతో వారి రాకకోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి  కాదు రెండు కాదు కోట్ల రూపాయలు టోపి వేసిన గుడ్డు కోసం వెతుకులాట కూడా కొనసాగిస్తున్నారు మరికొందరు. అధికార  కాంగ్రెస్ పార్టీ చోట లీడర్ వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

More articles

Latest article