25.5 C
Hyderabad

బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌చార్జ్

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏర్గట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త గొల్ల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముత్యాల సునీల్ కుమార్ వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి సానుభూతి తెలిపారు. వెంకన్న పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఏర్గట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏలేటి చిన్న బాలయ్యకు ఇటీవల గుండెకు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకుని ఆయనను పరామర్శించారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, మాజీ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం జీవన్ రెడ్డి, జింక అనిల్ కుమార్, మూస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి, మేకల సాయన్న, దండబోయిన సాయి, పన్నాల నర్సరెడ్డి, సుదన వేణి శ్రీనివాస్ గౌడ్, అన్నెల మురళి గౌడ్, పాకాల ప్రసాద్ గౌడ్‌తో పాటు ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Balkonda Congress in-charge consoles affected families.

More articles

Latest article