బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌చార్జ్
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏర్గట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త గొల్ల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముత్యాల సునీల్ కుమార్ వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి సానుభూతి తెలిపారు. వెంకన్న పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా...