బాలామృతం కోళ్ల పాలు

0 14,541
  • పక్కదారి పడుతున్న సరుకులు

 

రుద్రూర్, బతుకమ్మ : అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ‘బాలామృతం’ చిన్నారుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తోంది. పిల్లలు తీసుకునే ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం ఉంటుంది. ఈ కారణంగా వారిలో పోషకాల లోపాన్ని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలలో ఎదుగుతున్న బాలలను దృష్టిలో ఉంచుకొని ఏడు నెలల నుంచి 36 నెలల పిల్లలకు సమగ్ర పౌష్టికాహారం అందే విధంగా బాలామృతం కార్యక్రమాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే..! అయితే ఈ పౌష్టికాహారం పిల్లలకు అందకుండా కోళ్లకు , బర్రెలకు అందుతుంది. అంగన్వాడీ కేంద్రంలో అందించే బాలామృతం ప్యాకెట్లను రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో ఓ ఇంటి వద్ద కోళ్లకు ఆహరంగా వినియోగిస్తున్నారు. మండల కేంద్రంలోని పలు గ్రామాలల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సరుకులు పక్కదారి పడుతున్నాయని పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు అంగనవాడీ కేంద్రాల్లో పక్కదారి పడుతున్న పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని, బాలామృతం పశువులపాలు కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.