బాలామృతం కోళ్ల పాలు

పక్కదారి పడుతున్న సరుకులు   రుద్రూర్, బతుకమ్మ : అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ‘బాలామృతం’ చిన్నారుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తోంది. పిల్లలు తీసుకునే ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం ఉంటుంది. ఈ కారణంగా వారిలో పోషకాల లోపాన్ని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలలో ఎదుగుతున్న బాలలను దృష్టిలో ఉంచుకొని ఏడు నెలల నుంచి 36 నెలల పిల్లలకు సమగ్ర పౌష్టికాహారం అందే విధంగా బాలామృతం కార్యక్రమాన్ని అమలు...