28.2 C
Hyderabad

బాజిరెడ్డి రమాకాంత్ కు ఐదేళ్ల కఠిన జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

  • మరో ఐదుగురికి ఐదేళ్లు కారాగార శిక్ష

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన బాజిరెడ్డి రామకాంత్ కు ఐదు సంవత్సరాల కఠిన కారగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై అత్యాచారాలను విచారించే స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ సోమవారం తీర్పు చెప్పారు. రామకాంత్ తో పాటు మరో ఐదుగురుకి కూడా ఐదు సంవత్సరాల కారగార శిక్ష విధించారు. మోర్తాడ్ మండలం రామన్న పేట్ లో ఒక దళిత వ్యక్తికి చెందిన సివిల్ వివాదంలో అతనిపై మరో ఐదుగురిపై నేర న్యాయ విచారణ జరిపిన న్యాయస్థానం నేరారోపణనలు రుజువైనట్లు నిర్దారిస్తూ ఎస్.సి, ఎస్.టి చట్టం, ఐ పిసి సెక్షన్ లపై కేసు నమోదు అయింది.

More articles

Latest article