హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో తెలంగాణ మంత్రిగా శుక్రవారం అజారుద్దీన్ ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదటి సారి యూపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
