ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు
బతుకమ్మ, ఏర్గట్ల : ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో ముఖ్యమని ఎస్బిఐ ఏర్గట్ల శాఖ మేనేజర్ షేక్ కరీముల్లా ఉద్ఘాటించారు. ఏర్గట్ల లోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థ తీరుతెన్నులను వివరించారు. ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇన్సూరెన్స్ ప్రాధాన్యతపై శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీకి డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ.. భవిష్యత్తుపై భరోసా కోసం ప్రతి...