24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఆహార కల్తీపై అంగన్వాడి కేంద్రాల్లో చైతన్య సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

జక్రాన్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రూరల్ డివిజన్ అధ్యక్షుడు యాటకార్ల దేవేష్ , జిల్లా ఉపాధ్యక్షుడు వీఎన్. వర్మ ఆద్వర్యంలో పడ్కాల్  అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం ఆహార కల్తీ – అయోడిన్ ఉప్పు లో ప్లాస్టిక్ అంశం పై చైతన్య సదస్సు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి హాజరై మాట్లాడుతూ, ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న క్రమంలో వినియోగదారులుగా అందరూ చైతన్య వంతులు కావాలని అన్నారు. ఉప్పు, పప్పులు, వంటనూనెలు మొదలుకొని వివిధ రకాల అయోడిన్ ఉప్పు లు ప్లాస్టిక్ సంచుల్లో అమ్మకం జరుగుతున్నందున మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి చేరడం, క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. అనంతరం జక్రాన్ పల్లి మండల తహసిల్దార్ డి. కిరణ్మయి కలిసిన వినియోగదారుల ప్రతినిధులు విజిలెన్స్ కమిటీలలో వినియోగదారుల ప్రతినిధులను ఆహ్వానించాలని కోరారు. ఈ సందర్భంగా తహసిల్దార్ డి. కిరణ్మయి మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఆహార కల్తీ పై చైతన్య సదస్సులు అవసరమని, ఈ కార్యక్రమాలు చేపడుతున్న వినియోగదారుల ప్రతినిధులను అభినందించారు.  విజిలెన్స్ కమిటీలలో వినియోగదారుల ప్రతినిధులను తప్పనిసరిగా నియమిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ ప్యాకింగ్ వలన అయోడిన్ ఉప్పు లక్ష్యం వృధా అయిపోతున్నదని, కాబట్టి అన్ని రకాల ఉప్పు తయారీ దారులు ప్లాస్టిక్ కవర్ లలో ప్యాకింగ్ చేయరాదని తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2013 నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలను ఒక వేళ ప్యాకింగ్ లో చేస్తే, ఆ ప్లాస్టిక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు ప్యాకింగ్ పై ముద్రించాలని తెలిపారు. కాని వివిధ రకాల అయోడిన్ ఉప్పు తయారీ సంస్థలు నాసిరకం ప్లాస్టిక్ కవర్ లలో ఉప్పు ప్యాకింగ్ చేసి, చిన్న పిల్లలతో సహా అందరికీ క్యాన్సర్ రావడానికి కారణం అవుతున్నారని సాంబరాజు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, , ఉపాధ్యక్షుడు వి.యన్.వర్మ, ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్, రూరల్ ఇంచార్జీ కార్యదర్శులు యాటకర్ల దేవేష్,గైని రత్నాకర్, మహాదేవుని శ్రీనివాస్,అంగన్వాడీ సూపర్వైజర్ల రాణి అంగన్వాడి టీచర్,శోభ, అంగన్వాడి వెల్పర్స్, విద్యార్థిని, విద్యార్థులు, బాలింతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Awareness seminar in Anganwadi centers on food adulteration

More articles

Latest article