24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని దేవునిపల్లి ఆర్ టీ ఏ ఆఫీస్ వద్ద బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర ఆదేశానుసారం పోలీస్ కళాబృందం ఇన్ చార్జి హెడ్ కానిస్టేబుల్స్ రామంచ తిరుపతి, శేషరావు, పీసీ లు ప్రభాకర్, సాయిలు మాటలు పాటలు ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు సక్రమంగా పాటిస్తూ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ని కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ కొత్తగా తీసుకునే వారు, పాత లైసెన్సు ని రెన్యూవల్ చేసుకొనే వారు పాల్గొన్నారు.

More articles

Latest article