జాతీయ నులి పురుగుల నిర్మూలనపై అవగాహన

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ నులిపురుగుల నిర్మూలన పై అంగన్వాడి టీచర్లకు ప్రాధమిక ఆరోగ్యకేంద్రము వైద్యాధికారిణి డాక్టర్ ఆయేషా సిద్దిఖా అవగాహన కల్పించారు.  1నుండి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నిర్మూలనకై అర్పండజోల్ మాత్రలను ఇవ్వడం జరుగుతుందన్నారు. 1నుండి 2 సంవత్సరాల పిల్లలకు అర్థ మాత, 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఒక్క మాత్ర నమిలి మింగేలా చూడాలన్నారు. పిల్లలు పాదరక్షలు లేకుండా ఆడటం, బహిరంగ మలవిసర్జన చేయడం, మురికి చేతులు...