నందిపేట్, బతుకమ్మ :
ప్రజల భద్రత (సేఫ్టీ) లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు, అగ్నిమాపక (ఫైర్) శాఖ సిబ్బంది సంయుక్తంగా ప్రయాణికులకు అగ్నిమాపక భద్రతపై (ఫైర్ సేఫ్టీ) అవగాహన కల్పించేందుకు శనివారం నందిపేట బస్టాండ్ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇంట్లో గ్యాస్ సిలిండర్లను సురక్షితంగా వాడే విధానం, గ్యాస్ లీకైనప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, అనుకోకుండా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా వ్యవహరించి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలో ప్రజలకు వివరించారు. మహిళలు, ప్రయాణికులు పాల్గొని భద్రతా చర్యల గురించి తెలుసుకున్నారు.