తిరుమల, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణాలో రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే శ్రీవారిని ప్రార్థించారు. తిరుపతిలో విజయంచేసి ఉన్న శ్రీ ఆది శంకరాచార్య భగవత్పాద పరంపరాగత శ్రీ కంచి మూలామ్నాయ పీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని కూడా దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
