అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

0 2,792

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, అటవీ సంరక్షణపై సారంగాపూర్ బీట్ పరిధిలోని ఎడపల్లి సెక్షన్ లో శనివారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రేంజ్ ఆఫీసర్ సంజీవ్ రావు ఆదేశాల మేరకు బీట్ ఆఫీసర్ ప్రతాప్ అటవీ సంరక్షణపై స్థానికులకు అవగాహన కల్పించారు. అటవీ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తునికాకు కోసం అడవికి నిప్పు పెట్టొద్దని, లేని పక్షంలో బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.