నిజామాబాద్, బతుకమ్మ: మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించి సదుపాయాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ ను, నర్సింగ్ విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్లు పూర్తయ్యాయా? తరగతులు సక్రమంగా కొనసాగుతున్నాయా? అని ఆరా తీశారు. ప్రహరీ, రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలను పంపించాలని, అలాగే నిధులు మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ శాంతి సుభాష్ తదితరులున్నారు.
