ఆహార కల్తీపై అవగాహన

ఆర్మూర్, బతుకమ్మ : ఆహార కల్తీపై తల్లదండ్రులకు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు పౌడపెల్లి అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజుల రామనాధం ల ఆద్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. ఆర్మూర్  అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార కల్తీ - అయోడిన్ ఉప్పు లో ప్లాస్టిక్ అంశము పై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ, ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న క్రమంలో వినియోగదారులుగా అందరూ చైతన్య వంతులు కావాలని అన్నారు....