30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పదో తరగతి విద్యార్థులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు గురవారం అవహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ బలరాం పదవ రగతి పరీక్షలలో ఏ విధంగా విజయం సాధించాలనే అంశంపై అవగాహన కల్పించారు.  ఏ విధంగా పరీక్షలకు సంసిద్ధులు కావాలో విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు అధైర్య పడకుండా పరీక్షలను ధైర్యంగా రాయాలని సూచించారు.  అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలని అన్నారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్పులను గురించి వివరించారు. ఈ సంవత్సరం విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుందని, ఈసారి పరీక్షలలో గ్రేడింగ్ ఉండదని, విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు 20 మార్కులు వార్షిక పరీక్షలలో 80 మార్కులు ఉంటాయని తెలిపారు. ఆరు సబ్జెక్టులలో ఏడు పరీక్షలు ఏడు రోజులలో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లింగమూర్తి, కృష్ణారెడ్డి, రామకృష్ణ, దేవదాస్, మాధవి, స్వాతి పాల్గొన్నారు.

Awareness for class 10 students

More articles

Latest article