ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు గురవారం అవహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ బలరాం పదవ రగతి పరీక్షలలో ఏ విధంగా విజయం సాధించాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఏ విధంగా పరీక్షలకు సంసిద్ధులు కావాలో విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు అధైర్య పడకుండా పరీక్షలను ధైర్యంగా రాయాలని సూచించారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలని అన్నారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్పులను గురించి వివరించారు. ఈ సంవత్సరం విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుందని, ఈసారి పరీక్షలలో గ్రేడింగ్ ఉండదని, విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు 20 మార్కులు వార్షిక పరీక్షలలో 80 మార్కులు ఉంటాయని తెలిపారు. ఆరు సబ్జెక్టులలో ఏడు పరీక్షలు ఏడు రోజులలో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లింగమూర్తి, కృష్ణారెడ్డి, రామకృష్ణ, దేవదాస్, మాధవి, స్వాతి పాల్గొన్నారు.
