24.1 C
Hyderabad
Monday, August 3, 2026

7న బాడీ, అవయవ దానం పై అవగాహన సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అక్టోబర్ 7న బాడీ, అవయవ దానం పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక నర్రా రామారావు, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ కే.రామ్మోహన్రావు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ ఈవీఎల్ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమాన్నిపెన్షనర్స్ భవన్ ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఎదురుగా సుభాష్ నగర్ నిజామాబాద్ నందు జన విజ్ఞాన వేదిక, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఎన్నో సంవత్సరాలుగా అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్న ప్రముఖు అవయవ దాన ప్రచారకర్తలు హాజరవుతున్నారని అన్నారు. మంచి విజ్ఞాన దాయకమైన ఈ అంశం పై అవగాహన పెంపొందించుకోవడానికి సదస్సుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article