29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతున్న టమాటా వైరస్

Must read

📰 Generate e-Paper Clip

మధ్యప్రదేశ్‌, బతుకమ్మ : మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని పాఠశాల విద్యార్థుల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇది సోకిన చిన్నారుల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతాయి. ఈ వైరస్ సోకితే.. మంట, నొప్పిగా అనిపించడం, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని ఇంటి వద్దే పిల్లలను ఉంచాలని అధికారులు సూచనలు చేశారు. 12 ఏళ్ల లోపు చిన్నారుల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు అధికారులు గుర్తించారు. వైరస్ సోకిన 3-6 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. దీనికి ప్రత్యేక చికిత్స ఏదీ లేదు. ఇది మామూలు సమస్యేనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

More articles

Latest article