పొగాకు నివారణ పైన విద్యార్థులకు అవగాహన

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి పరిధిలో గల గౌరారం ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలలో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొగాకు వాడకం చేయరాదని పాఠశాల పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులను అమ్మడం నిషేధించడం జరిగిందని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై. శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వై.శంకర్ మాట్లాడుతూ ధూమపానం (పొగ త్రాగడం) మద్యపానం (మద్యం సేవించడం) రెండూ ఆరోగ్యానికి చాలా హానికరం, ఇవి క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు ఇతర...