ఇందల్వాయి, బతుకమ్మ : మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఇందల్ వాయి నందు సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ కార్యదర్శులు చే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి గ్రామంలో గ్రామ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని నీటి నిలువ గల ప్రాంతాలను తొలగించాలని, దోమ నిల్వగల ప్రాంతాలైన చెత్తాచెదారంను వెంట వెంట తొలగించేలా ఏర్పాటు చేయాలని, నీరు లీకేజ్ కాకుండా పిట్ టాప్స్ ను మూయించాలని, మంచినీటి పైపులైన్లు మురికి కాలువల గుంట ఉన్నట్లయితే వాటిని తొలగించాలని తెలిపారు. గ్రామ మంచినీటి ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ ను కలపాలని ఆదేశించారు. ఆడ ఇనాఫిలిస్ దోమ వలన మలేరియా, ఎడిస్ ఈజిప్ట్ దోమ వలన డెంగ్యూ చికునుగునియా, క్యూలెక్స్ దోమ వలన ఫైలేరియా జపానీస్ ఇన్ సేఫిలైటిస్ (మెదడు వాపు) లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కావున దోమ లార్వా వృద్ధి చెందే ప్రాంతాలను నాశనం చేయాలని తెలిపారు.ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాల, రెసిడెన్సీయల్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు సందర్శించాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో వైద్యాధికారి డాక్టర్ క్రిస్టినా, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్. భువన, మండల అభివృద్ధి అధికారి అనంతరావ్,ఆరోగ్య విస్తరణాధికారి వై. శంకర్,గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
1563
