26.2 C
Hyderabad
Wednesday, August 5, 2026

ప్రభుత్వ పాఠశాలల నిధులపై ఆడిట్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన నిధుల వినియోగంపై బుధవారం ఆడిట్ నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్స్ బృందం ఆదర్శ హిందీ విద్యాలయం పాఠశాలలో నిజామాబాద్ దక్షిణ, ఉత్తర మండలాలతో పాటు నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాలకు చెందిన సుమారు 150 ప్రభుత్వ పాఠశాలల నిధుల వివరాలను పరిశీలించింది. పాఠశాలలకు వివిధ పద్దుల కింద మంజూరైన నిధులు ఏ విధంగా ఖర్చు చేశారనే అంశాలను ఆడిటర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలకు సంబంధించిన నిధుల వినియోగ వివరాలు, రికార్డులను ఆడిట్ బృందానికి సమర్పించారు. ఆడిటర్లు జయప్రకాష్, ధనుష్, నరేందర్‌లు క్యాష్ బుక్స్, వోచర్లు తదితర రికార్డులను పరిశీలించారు. ఆడిట్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు పీఆర్టీయూ ఉత్తర, దక్షిణ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, జావిద్, అస్రార్ అహ్మద్, సాయికుమార్, ప్రవీణ్‌తో పాటు ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎబినైజర్ తదితరులు సహకారం అందించారు. నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నిధుల ఆడిట్‌ను 100 శాతం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

More articles

Latest article