ప్రభుత్వ పాఠశాలల నిధులపై ఆడిట్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన నిధుల వినియోగంపై బుధవారం ఆడిట్ నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్స్ బృందం ఆదర్శ హిందీ విద్యాలయం పాఠశాలలో నిజామాబాద్ దక్షిణ, ఉత్తర మండలాలతో పాటు నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాలకు చెందిన సుమారు 150 ప్రభుత్వ పాఠశాలల నిధుల వివరాలను పరిశీలించింది. పాఠశాలలకు వివిధ పద్దుల కింద మంజూరైన నిధులు ఏ విధంగా ఖర్చు చేశారనే అంశాలను ఆడిటర్లు క్షుణ్ణంగా పరిశీలించారు....