బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. కల్వకుంట్ల కవిత మాటలు వింటుంటే బీఆర్ఎస్ 3 ముక్కలు, 4 చెక్కలు అయినట్లే ఉందని వ్యాఖ్యనించారు. గతంలో విజయశాంతిని బయటకు పంపినట్లే ఇప్పుడు కవితను కూడా బయటకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో మాట్లాడకపోయినా కనీసం ఇప్పుడైనా కవిత నిజాలు మాట్లాడుతున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
