26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రముఖ పల్మనాలజిస్ట్ రాజేంద్రప్రసాద్ కు హెల్త్ ఎక్స్ పురస్కారం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరానికి చెందిన సీనియర్ వైద్యుడు, ప్రముఖ పల్మనాజిస్ట్ ( శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బొద్దుల రాజేంద్ర ప్రసాద్ విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారం అందుకున్నారు.  ఆయన అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించిన రాజ్ న్యూస్  విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారానికి ఎంపిక చేసింది. హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో  రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సీతక్కలు డాక్టర్ రాజేంద్రప్రసాద్ కు ఈ పురస్కారాన్ని అందజేసి అభినందించారు. విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలను అందజేస్తానని ఆయన తెలిపారు.

Doctor Rajendra Prasad receives VISA Health X award

More articles

Latest article