మణుగూరు, బతుకమ్మ : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫర్నిచర్ కు నిప్పు పెట్టడంతో పాటు ఆవరణలో ఫ్లెక్సీలు చింపేశారు.
