28.8 C
Hyderabad
Monday, August 3, 2026

నగరం లో తెల్ల వారుతున్న వేళ… బంగారు గొలుసు దొంగల హల్చల్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రెండు ప్రాంతాల్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

. . . కారులో వచ్చి దర్జాగా బంగారు గొలుసు ల చోరి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో తెల్లవారుతుండగానే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.. శనివారం ఉదయం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాక్లూర్ మండలం లో ఓ మహిళను అడ్రస్ అడిగినట్లు అడిగి రెండు తులాల బంగారు గొలుసు తెంపుకొని పరారీ అయ్యారు. తర్వాత అక్కడి నుంచి నగరంలో మూడవ టౌన్ పరిధిలోని  దుబ్బ ప్రాంతంలో తెల్లవారుజామున ఆరుబయట వాకిలి ఉడ్చే మహిళ మెడలో బంగారు గొలుసు తో పాటు చెవి కమ్మలు లాక్కుని పరారీ అయ్యారు. మహిళ లబోదిబో మంటు దొంగలు దొంగలు అంటు అరిచే సరికి వారు పరారి అయ్యారు.

As dawn breaks over the city... gold chain snatchers run amok

నలుగురు సభ్యులు కలిగిన ముఠా కారులో వచ్చి సిని పక్కిలో బంగారు గొలుసులు చోరికి పాల్పడటం కలకలం రేపింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు చైన్ స్నాచింగ్ లు అన్ని బైక్ ల మీద వచ్చి చోరి చేసిన దాఖలు ఉన్నాయి. అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలు కూడా  బైక్ లపై చోరీలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. కాని తొలిసారి కార్ లో వచ్చిన దొంగలు గొలుసులతో పాటు కమ్మలు లాక్కుని వెళ్లడం కలకలం రేపింది.ఈ రెండు ఘటన నేపథ్యంలో దుండగులు వచ్చిన కారు వివరాలు గుర్తించేందుకు కమిషనరేట్ పరిధిలో నాకా బంది నిర్వహించారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పని కావచ్చని, కారు కూడా దొంగిలించినది లేదా నెంబర్ ప్లేట్లను మార్చి చోరీకి పాల్పడ్డారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.శనివారం ఉదయం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దుబ్బ  బంగారు గొలుసులు, కమ్మలు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

As dawn breaks over the city... gold chain snatchers run amok

More articles

Latest article