పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై ఆర్యవైశ్యులు ముక్త కంఠంతో ఖండించాలి

0 2,246

. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ

తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు పేరు మార్చడాన్ని రాష్ట్రంలోని ఆర్యవైశ్యులంతా ముక్తకంఠంతో ఖండించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. సేవా కార్యక్ర మాల్లో ఆధ్యాత్మిక, కార్యక్ర మాల్లో ఆర్య వైశ్యులు ఎల్ల ప్పుడూ ముందుంటారని,సేవకు మారుపేరు ఆర్య వైశ్యులని ఆయన అన్నారు. ఆదివారం నగరంలొోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ  సమావేశం నిర్వహించారు. ఈ   సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ  వైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్స వాలు,దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించినందుకు అభినం చారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్చా లనే నిర్ణయంపై ఆర్యవై శ్యులు ముక్త కంఠంతో పోరాడాలని పిలుపునిచ్చారు.తెలుగు యూనివర్సిటీ అం టేనే గుర్తుకు వచ్చే పొట్టి శ్రీరాములు పేరు మార్పు చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరా ములు ఏ ప్రాంతానికో రాష్ట్రానికో చెందినవారు కాదని గుర్తించాలన్నారు. స్వాతం త్ర్య ఉద్యమంలో పాల్గొని గాంధీ జీ ప్రశంసలు అందుకు న్న మహా వ్యక్తి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు విశ్వ విద్యాలయానికి ఆ పేరు పెట్టారని, కానీ ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. ప్రతేక ఆంధ్ర రాష్ట్రము కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహో న్నత వ్యక్తి అని చెప్పారు. అలాంటి జాతీయ నాయ కుని పేరు మార్చడం అనేది స్వాతంత్ర సమరయోధులను, జాతీయ నాయకులను అవమానించడమేనని అన్నా రు. పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై ఆర్యవైశ్యులు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్య వైశ్యులు ఐక్యంగా ఉండాలని ఐక్యతతోనే ఏదైనా సాధ్యమని అన్నారు. కార్యక్రమం లో టిఆర్పి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ గుప్తా, ఆర్గజింగ్ సెక్రటరీ దేవతా చంద్రశేఖర్ ( చందు), గజవాడ శ్రీనివాస్, ధన్పాల్ శ్రీనివాస్, పార్షి మారుతి, లాబిశెట్టి శ్రీనివాస్ గుప్తా, ప్రవీణ్ కుమార్ గుప్తా, పట్టణ సంఘ సభ్యులు, అనుబంధ సంఘాల సభ్యులు, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Arya Vaishyas should openly condemn the change of name of Potti Sriramulu

Leave A Reply

Your email address will not be published.