24.2 C
Hyderabad

మహాసభను జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ

ఈ నెల 16న రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించే సీపీఎం పార్టీ ఏరియా మహాసభను జయప్రదం చేయాలని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడేళ్ల కాలంలో పార్టీ చేసిన పోరాటాలు, ఉద్యమాలను సమీక్షించి, భవిష్యత్ పోరాటాలను రూపొందించుకుంటామని తెలిపారు. ఏరియా మహాసభకు సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా నాయకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఏరియా పరిధిలోని ఆరు మండలాల నాయకులు,కార్యకర్తలు, సభ్యులు, సానుభూతిపరులు, కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు లక్ష్మణ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article