. . . తెలంగాణ విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు
. . . 136 పత్రాలతో సదస్సు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కృత్రిమ మేధా మానవ మనుగడకు సహాయకారి మాత్రమే అని, దానిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో “కృత్రిమ మేధాతో ఆంగ్ల భాషా బోధనను మార్చడం: సవాళ్లు, అవకాశాలు, భవిష్యత్తు మార్గాలు” అంశంపై జాతీయ సదస్సును గురువారం నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ రంగరత్నం సదస్సు అధ్యక్షత వహిస్తూ ఈ విద్యా సంవత్సరంలో గిరిరాజు కళాశాలలో ఇది నాలుగవ జాతీయ సదస్సు అని, విద్యార్థులకు ఉపయుక్తమైన అనేక సదస్సులు కార్యశాలలు, కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఆంగ్ల విభాగం కృత్రిమ మేధాపై సదస్సు ఎంచుకొని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అధ్యాపకులను అభినందించారు. కృత్రిమ మేధా అందరికీ అవసరమైన ఒక ప్రత్యేక పనిముట్టు అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర పూర్ణలోని ఎస్.జి.బి.ఏం. కళాశాల ప్రిన్సిపల్ డా. రాజ్ కుమార్, తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ఆచార్యులు కె.వి రమణాచారి, సమత, ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ జాన్ సుకుమార్, డాక్టర్ శ్యామ్ కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులు సమాజంపై ప్రభావితం చేస్తుందని, విద్యార్థులు విద్యాభ్యాసంలో కృత్రిమ మేధను ఉపయోగించుకుంటూ, దానిని అందిపుచ్చుకోగలిగితే భవిష్యత్తులో అవకాశాలు మెరుగ్గానే ఉంటాయని అన్నారు. కీలకోపన్యాసకురాలు వరంగల్ ఎన్ఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్పూర్తి మాట్లాడుతూ విద్యారంగంలో పార్టీ ప్రణాళికలు, పాఠ్యాంశాల రూపకల్పన, కొత్త అంశాల అభ్యాసనలు వేగంగా తయారు చేసుకోవడానికి ఇప్పటికీ అంతర్జాలంలో అనేక ఏఐ యాపులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సెమినార్లో 136 పాత్ర సమర్పణలు జరిగాయని సదస్సు కన్వీనర్ డాక్టర్ దండు స్వామి తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పత్ర సమర్పకులు ఆన్లైన్లో ఆఫ్లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ దండు స్వామి కోకన్వీనర్ డాక్టర్ నాగజ్యోతి, ప్రతిభ, లావణ్య, దస్తప్ప, రాజశేఖర్, మౌనిక, సన్నిత్, వసంత్, నిఖిత్ ఫాతిమా, స్థిత ప్రజ్ఞ, అధ్యాపకులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.