నందిపేట్ పోలీస్ వారి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ పోగ్రాం

నందిపేట, బతుకమ్మ :   నందిపేట మండల కేంద్రంలో ఎస్సై శ్యామ్ రాజ్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం మండల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్యామ్ రాజ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముందుగా అధికారులు ముందుకు రావాలని శుక్రవారం రోజున ప్రభుత్వ అధికారులతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రతి పౌరుడు ఖచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. మద్యం సేవించి, బైకులు, కార్లు ఇతర వాహనాలు నడపరాదని,...