- ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వినర్ శశి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అసత్య సమాచారంతో పోలీసులు అక్రమ అరెస్టులు, బెదిరింపులు సరైంది కాదని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వినర్ శశి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ నిజామాబాద్ కార్యాలయానికి బుధవారం ఉదయం 20 నుండి 30 మంది దాకా పోలీసులు కార్యాలయంనికి వచ్చచారని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగ్రాం చేస్తున్నారని అందరిని అరెస్ట్ చేయడానికి వచ్చామని అన్నారని అన్నారు. మాది ఏ ప్రోగ్రాం కూడా నిజామాబాద్ లో లేదు రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుందని తెలిపారు. మెంబర్షిప్ కోసం వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళనివ్వకుండా దాదాపుగా 9 గంటల నుండి 12 గంటల వరకు ఆఫీసులోనే అక్రమ అరెస్టు చేసి మెంబర్షిప్ కోసం వెళ్తా అంటే కూడా వెళ్ళనివ్వకుండా భయభ్రాంతులను చేయాలని ప్రయత్నం చేశారని తెలిపారు. తప్పుడు సమాచారంతో విద్యార్థి నాయకులను, విద్యార్థి సంఘాలను తొక్కి పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. మీ తాటాకు చప్పుళ్ళకి ఉడుత బెదిరింపులకు భయపడే ఆర్గనైజేషన్ ఎబివిపి కాదని, ఏబీవీపీ అంటే విద్యార్థుల గుండెచప్పుడు అని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 8300 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, దారిద్యరేఖకు దిగునటువంటి విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని తెలిపారు. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అయ్యే వరకు కార్యక్రమాలు ఉద్యమాలు చేయడానికి శ్రీకారం చుట్టపోతున్నామన్నారు. ఆగస్టు ఫస్ట్ వీక్ లో దాదాపు 10000 మంది విద్యార్థులతో నిజామాబాద్ జిల్లా మొత్తాన్ని సంభవింప చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అయ్యే వరకు మా ఉద్యమాన్ని ఆపేదే లేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని తెలిపారు.
