బతుకమ్మ, బోధన్ : బోధన్ కొత్త బస్టాండ్ మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను సోమవారం షీ టీం సభ్యులు అరెస్ట్ చేశారు. వీరిని బోధన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వి వెంకట్ నారాయణ అప్పగించగా బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరుపరచగా రెండు రోజుల రిమాండ్ విధించారు.
