24 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ సర్పంచ్ ల  అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీ

భగ్నం చేసిన పోలీసులు

బతుకమ్మ, మాచారెడ్డి: పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సర్పంచ్ ల‌‌‌ సంఘం తల పెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.  మాజీ సర్పంచ్ లను వారి ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా మాజీ సర్పంచ్ లు మాట్లాడుతూ గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు రావాల్సిన బిల్లుల చెక్కులను ఎస్టీవో లో సబ్మిట్ చేసి  రెండు సంవత్సరాలు అవుతున్నా డబ్బులు రిలీజ్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. పోలీసులు అక్రమ అరెస్టులను ఖండించారు.    సర్పంచ్ ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి  వెళ్తుండగా మాచారెడ్డి పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. సమస్యల సాధన కోసం శాంతియుత నిరసన కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకోవడం నియంత పాలనను తలపిస్తోందన్నారు. అడ్డుకుని అవస్థలకు గురిచేసే బదులు ప్రభుత్వం పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

More articles

Latest article