. . . ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
. . . 74 కిలోల కాపర్ కాయిల్స్
… చోరికి వినియోగించిన వాహనాలు సీజ్
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
వేల్పూర్, బతుకమ్మ:
ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు నుంచి రాగి కాయిల్స్ లను దొంగతనం చేస్తున్న ఆరుగురిని , దొంగిలించిన రాగి కాయిల్స్ లను కొనుగోలు చేసిన ఒక్కరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.. మంగళవారం వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కమిషనర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ … ఆర్మూర్ పట్టణంలో పోచమ్మ గల్లి కి చెందిన కర్రె వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంజల్ల ఈశ్వర్, బాజా హరిప్రసాద్, కర్రె విజయకుమార్, మూల దుర్గ ప్రసాద్ రెడ్డి లు జల్సాలకు అలవాటు పడి చోరిలకు పాల్ పడుతున్నారన్నారు. వినోద్, విజయ్ ఇద్దరు అన్నదమ్ములు కలిసి పాత ఇనుప సామాను పేరుతో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల్లో పట్ట పగలు తిరుగుతూ, రాత్రివేళ ఆరుగురితో కలిసి ట్రాన్స్ పార్మర్ లు పగల గోటి రాగి తీగలు దొంగతనాలు చేస్తూ అబ్దుల్ వసీం విక్రయించే వారని తెలిపారు. పాత నేరస్తుడు ఐనా స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీం హైమద్ అలియాస్ తిల్లిబాబా సలహా మేరకు ఆరుగురు ముఠాగా ఏర్పడి ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలలోని చుట్టుపక్కల వ్యవసాయ ప్రాంతలలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను ధ్వంసం చేయడం రాగి తీగలు దొంగతనం వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదైనట్లు ఆయన తెలిపారు.

మంగళవారం కర్రె వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంజల్ల ఈశ్వర్, బాజా హరిప్రసాద్, కర్రె విజయకుమార్, మూల దుర్గ ప్రసాద్ రెడ్డి వేల్పూర్ మండలం లో పడిగెల గ్రామ శివారులో గల రైల్వే బ్రిడ్జి వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని, దొంగతనం చేసిన సొత్తును సైతం నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. దొంగ సొత్తు కొనుగోలు చేసిన నిందితులు అబ్దుల్ వాసిం సైతం ఆర్మూర్లో పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితుల నుంచి 74 కిలోల రాగి తీగలు, బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో, హోండా షైన్ మోటార్ సైకిల్, యమహా స్కూటీ, బజాజ్ డిస్కవర్ మోటార్ సైకిల్, ఐదు మొబైల్ ఫోన్లు, దొంగతనం చేసేందుకు ఉపయోగించిన పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి బాబా పై గతంలో ఆర్మూర్ , మెండోర , నిజామాబాద్ నాల్గవ టౌన్ పి.ఎస్ లో చోరీ సొత్తు కొన్న కేసులు కలవు. నిందితులు వేల్పూర్ పి.ఎస్ లో 4 కేసులు, బాల్కొండ లో 5 కేసులు, మెండోర లో 3 కేసులు, భీంగల్ లో ఒక కేస్, ఆర్మూర్ లో 5 కేసులు, యెర్గట్ల పి. ఎస్ లో ఒక కేస్, మొత్తం 19 కేసులో నిందితులుగా ఉన్నారన్నారు.

ఈ కేసు చేదించిన ముఖ్యపాత్ర పోషించిన ఆర్మూర్ రూరల్ సీఐ. జాన్ రెడ్డి, వేల్పూర్ మండల ఎస్సై,సంజీవ్, బాల్కొండ ఎస్సై.శైలేందర్, మెండోరా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ భరత్ గౌడ్, వేల్పూర్ మండలం పోలీస్ కానిస్టేబుల్ నరేందర్, హెడ్ కానిస్టేబుల్ హరీష్, ముప్కాల్ మండల పోలీస్ కానిస్టేబుల్ సాయి కిరణ్, వేల్పూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పీ. శ్రావణ్, వేల్పూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సుదర్శన్ లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.
