30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బియంబి మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట మోసం చేసిన నిందితుల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • మోసపూరిత ప్రకటనలకు ప్రజలు ఆకర్షితులు కాకూడదు
  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం ఐన బియంబి కంపెనీ పేరుతో  22 మందిని మోసం చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. తోకల బక్కన్న అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన దరఖాస్తు ప్రకారం.. అక్టోబర్ 13న నగరంలోని కోటగల్లీలోని కెనరా బ్యాంకు పక్కకు ఉన్నటువంటి బిఎంబి కంపెనీ  చూసి అక్కడికి వెళ్ళగా నిందితుడైన చంద్రశేఖర ప్రసాద్ పిలువగా అతనిని కలిసి అతని ద్వారా మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం అయినటువంటి బియంబి కంపెనీ గురించి తెలుసుకొవడం జరిగింది.అది ఇంగ్లాండు దేశంకు చెందినదని  దాంట్లో పెట్టుబడి పెట్టి కంపెనీ యాడ్స్ కి రేటింగ్ ఇవ్వడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని అలాగే వివిధ రకాలైన గృహ ఉపకరణాలు, సెల్ ఫోన్లు కూడా పొందవచ్చునని నమ్మించాడు. మోసపూరిత మాటల ద్వారా నమ్మించగా నిందితుడైన చంద్రశేఖర ప్రసాద్ యొక్క మాటలు నమ్మి నిందితుడు పంపిన లింకు ద్వారా తన ఫోన్లో బియంబి కంపెనీకి సంబంధించిన ఆప్ ను ఇన్స్టాల్ చేసుకుని అందులో జాయిన్ అయ్యాడు. సుమారు రూ  84,398 రూపాయలను వేరువేరు లెవెల్స్ లలో విడుదల వారీగా నిందితుడు ఫోన్లో పంపినటువంటి లింకుల ద్వారా కంపెనీ యాప్ నందు ఫోన్పే ద్వారా నిందితుడు పంపినటువంటి లింకులలో పెట్టుబడి పెట్టాడు. అధిక రాబడి, కమీషన్ కు ఆశపడి మాయ మాటలకు ఆకర్షితుడై తన రక్తసంబంధీకుల తరఫున ,తనకు తెలిసిన వారి తరఫున కూడా కొంత మొత్తంలో నగదును కంపెనీ ఆప్ యందు పెట్టుబడి పెట్టించాడు. అతని కంపెనీ వాలెట్ అకౌంట్ యందు జమ అయినటువంటి ఫేక్ ఎమౌంటును విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా అమౌంట్ విత్ డ్రా కాలేదని తాను మోసపోయానని తెలుసుకొని పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయలేదని అన్నారు. నిందితుడు ఈ విధంగా సుమారు 22 మందిని మోసం చేసినట్లు తెలిసింది. ఇట్టి బిఎంబి కంపెనీ పెట్టుబడులు పెట్టి సుమారు 750 మంది వరకు మోసపోయినట్లుగా తెలిసినది.  బాధితులు ఇట్టి బిఎంబి కంపెనీ యందు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుల విలువ సుమారు కోటి నుండి కోటిన్నర వరకు కలదు. ప్రస్తుతం ఇట్టి బియంబీకంపెనీకి చెందినటువంటి యాప్ పనిచేయటం లేదు. కంపెనీ పంపిన లింకులన్నీ కూడా చైనా బేస్డ్ లింకులని ఆ లింకుల ద్వారా పంపినటువంటి కోటి నుండి కోటినర రూపాయలు చైనా బేస్డ్ లింకులకు డైవర్ట్ అయినట్లు సమాచారం కలదు తెలిపారు.కావున ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా ఎవ్వరు కూడా ఇలాంటి మోసపూరితమైనటువంటి మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ చైన్ సిస్టం యందు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలను పొందాలని ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టకూడదు మోసపోకూడదు ఇలాంటి ఎరవేసి మభ్యపెట్టి మోసపూరిత మాటలు చెప్పి ఆకర్షణ చేసేటువంటి వ్యక్తుల గురించి తమ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నందు సమాచారం ఇవ్వాలి దరఖాస్తు ఇవ్వాలని మనవి చేశారు.

More articles

Latest article