25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రేషన్ కార్డు ఆధారంగా  ఆరోగ్యశ్రీ సేవలు

Must read

📰 Generate e-Paper Clip

ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌, బతుకమ్మ :  ప్రభుత్వ పథకాలలో ముఖ్యమైన ఆరోగ్యశ్రీ సేవలను రేషన్ కార్డు ఆధారంగా అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. నూతన కార్డుదారులు ఆరోగ్యశ్రీ ప్రయోజనాలను పొందడంలో జాప్యం కాకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇప్పటికే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి లబ్ధిదారుల వివరాలను సేకరించి.. సేవల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో 90.10 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా.. దాదాపు 2.84 కోట్ల మంది వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కార్డులు పొందే కుటుంబాల నుంచి గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మీ, చేయూత తదితర పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అధికారులు నేరుగా లబ్దిదారులకు వెళ్లి వారి వివరాలను నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి, అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ విధానంతో    తక్కువ సమయంలోనే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలు పొందగలుగుతారు.

More articles

Latest article