రేషన్ కార్డు ఆధారంగా  ఆరోగ్యశ్రీ సేవలు

ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్‌, బతుకమ్మ :  ప్రభుత్వ పథకాలలో ముఖ్యమైన ఆరోగ్యశ్రీ సేవలను రేషన్ కార్డు ఆధారంగా అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. నూతన కార్డుదారులు ఆరోగ్యశ్రీ ప్రయోజనాలను పొందడంలో జాప్యం కాకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇప్పటికే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి లబ్ధిదారుల వివరాలను సేకరించి.. సేవల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో 90.10 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా.. దాదాపు 2.84 కోట్ల మంది వివిధ...