27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్మూర్ మంగళం శ్రీనుగా పైడి రాకేష్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  • కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్ చారి

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ :   ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంగళం శ్రీనులాంటి వాడని కేంద్రమాజీ మంత్రి వేణుగోపాల్ చారి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి వేణు గోపాల్ చారి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి వేణు గోపాల్ చారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వములో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, డ్వాక్రా మహిళల కొరకు స్టాల్స్ ఏర్పాటు ,500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంచడం, సన్నరకం వడ్లకు బోనస్ ఇచ్చారని తెలిపారు. గతంలో టిఆర్ఎస్ చేసిన 7లక్షల కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ కడుతునే మరొక వైపు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చేస్తున్న కళ్ళు కనిపించని బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఒకటిగా కూటమి ఏర్పడి లోపాయికారీ ఒప్పందాలతో బిజెపి ఎంపీలను గెలిపించాలనే ఆలోచనలతో ముందుకు వెళ్లారని అన్నారు. రాష్ట్రంలో బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రత్యేక నిధులు తీసుకురావడం లేదని, తెలంగాణ ఏర్పాటు సమయంలో కుదుర్చుకున్న రిఆర్గనైజేషన్ ఆక్ట్ ద్వారా రావాల్సిన నిధుల గురించి మోడీతో బిజెపి నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు అని  ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాకు అమృత్ స్కీం ద్వారా 18 ట్యాంకులతో 215 కోట్ల రూపాయలతో పైప్ లైన్ నిర్మించి ప్రతి ఇంటికి కలెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని, అదేవిధంగా 168 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించే దిశగా ప్రాణాలిక రూపొందిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో బిజెపి పసుపు బోర్డు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని కానీ రేవంత్ రెడ్డి  తెలంగాణ రాష్ట్రంలో రెండు పత్తి పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు  చిరుధాన్యాల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయమని ఎన్నిసార్లు వినతి పత్రాలు పెట్టిన స్పందించడం లేదు అని  తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో 14.5 ఉన్న జిడిపి ఈరోజు 6.5 అయింది అంటే అది కేవలం బిజెపి చేస్తున్న అనాలోచిత కార్యక్రమాల వల్లనే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే 61,145 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, అదేవిధంగా అన్ని రంగాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో మరి ముఖ్యంగా యువతకు సంవత్సర కాలంలోని 53 వేల ఉద్యోగాలు నియమించడం జరిగిందని ,డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని స్కిల్ యూనివర్సిటీలు ప్రారంభించామన్నారు. రామప్ప సర్క్యూట్ కు రేవంత్ రెడ్డి 75 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తుంటే ప్రజలు తమను మర్చిపోతారు ఏమో అని బిజెపి, బిఆర్ఎస్ నాయకులు కేవలం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలుగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఆదరించి ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు. బిజెపి నాయకులు , టిఆర్ఎస్ నాయకులు  అధికారులతో సమీక్షలు జరిపితే అధికారులు మీకు జరిగిన అభివృద్ధిని మంజూరు చేసిన నిధుల గురించి చెప్తారని తెలిపారు. అంతేకానీ ఏం తెలుసుకోకుండా ఛార్జ్ సీటు విడుదల చేయడం, విమర్శలు చేయడం  బిజెపి నాయకులకు తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు,  జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా సేవల అధ్యక్షులు సంతోష్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ సాయిలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ మహేష్,దాత్రిక భాస్కర్,ముష్షు పటేల్,nsui నాయకులు నిఖిల్ రెడ్డి,హరీష్,కౌశిక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Armor Mangalam Srinuga Paidi Rakesh Reddy

More articles

Latest article