నిజామాబాద్, బతుకమ్మ : *నిజామాబాద్ జిల్లాకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది గా సీనియర్ న్యాయవాది అమిదాల సుదర్శన్ ను నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీచేసింది.సుదర్శన్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.జిల్లాకోర్టు, అదనపు జిల్లాకోర్టు, సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలలో జిల్లా అధికార యంత్రాంగం తరపున సుదర్శన్ న్యాయసేవలు అందించనున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నిజామాబాద్ నగరంలోనే కొనసాగింది.ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మహారాష్ట్ర లోని నాందేడ్ లోని న్యాయ కళాశాలలో లా పట్ఠభద్రులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాది గా పేరు నమోదు చేసుకుని 1990 సంవత్సరం నుండి నిజామాబాద్ జిల్లాకోర్టుతో పాటు,వివిధ కోర్టులలో న్యాయవాది గా ప్రాక్టీస్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా అడ్వొకేట్స్ కోపరేటివ్ సొసైటీ సభ్యునిగా న్యాయవాదుల అభ్యున్నతికి కృషి చేశారు. సుదర్శన్ ను ప్రభుత్వ న్యాయవాది గా నియామకం చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్,ప్రధాన కార్యదర్శి వసంత్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ తన నియమాకానికి సహకరించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో ప్రభుత్వవానికి సంబంధించిన కేసులలో బలమైన వాణి వినిపించగలనని అన్నారు. ఎజిపిగా ఎర్రం సదానంద్….ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా సీనియర్ న్యాయవాది ఎర్రం సదానంద్ ను నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీచేశారు.డిచ్ పల్లి మండలంలోని కొత్తపేట్ గ్రామానికి ఆయన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సదానంద్ నియామకం పట్ల న్యాయవాదులు నల్లవెళ్లి శ్రీనివాస్ రెడ్డి, ఆశ నారాయణ, రత్నాకర్ రెడ్డి,మాజీ పిపి మధుసూదన్ రావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సదానంద్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు అభిలాషించారు.ఈ సందర్భంగా సదానంద్ మాట్లాడుతూ తన నియమాకానికి కృషి చేసిన నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు భూపతి రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.