జిల్లాకోర్టు గవర్నమెంట్ ప్లీడర్ గా అమిదాల నియామకం

నిజామాబాద్, బతుకమ్మ : *నిజామాబాద్ జిల్లాకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది గా సీనియర్ న్యాయవాది అమిదాల సుదర్శన్ ను నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీచేసింది.సుదర్శన్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.జిల్లాకోర్టు, అదనపు జిల్లాకోర్టు, సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలలో జిల్లా అధికార యంత్రాంగం తరపున సుదర్శన్ న్యాయసేవలు అందించనున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నిజామాబాద్ నగరంలోనే కొనసాగింది.ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మహారాష్ట్ర లోని నాందేడ్ లోని న్యాయ కళాశాలలో లా...