బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా అపర్ణ
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాయక్ వాడి అపర్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఈ మేరకు అపర్ణకు నియామక పత్రాన్ని అందజేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన అపర్ణ పట్టణ ఆర్యక్షత్రియ సంఘం గౌరవధ్యక్షురాలుగానూ, సీనియర్ మహిళా కాంగ్రెస్ నేతగా సుపరిచితులు. తనను రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించిన...