26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

Must read

📰 Generate e-Paper Clip

రివ్యూ కమిటీ అనుమతితోనే  ఫోన్ ట్యాపింగ్

హైకోర్టుకు తెలిపిన ప్రభాకర్ రావు

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రివ్యూ కమిటీలో ఉన్న ఉన్నతాధికారులను దర్యాప్తు బృందం విచారణ చేయనుంది. సీఎస్,హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం అధికారులను విచారించనున్నారు. ఎస్ఐబీలో లీగల్‌గానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు హైకోర్టుకు తెలిపాడు. రివ్యూ కమిటీ అనుమతితోనే 2023, డిసెంబరులో ఫోన్ ట్యాపింగ్ డేటా ధ్వంసం చేశామని ప్రభాకర్ రావు కోర్టుకు తెలిపారు. రివ్యూ కమిటీలోని అప్పటి సభ్యులను విచారించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. మరోవైపు, ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

More articles

Latest article