రుద్రూర్, బతుకమ్మ : హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా రుద్రూర్ మండలం అంబం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈరోజు సాయంత్రం 04:00 గంటలకు పోచమ్మ గుడి వద్ద “కుస్తీ “పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.