27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

హనుమాన్ ఆలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్టాపన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : హనుమాన్ జన్మత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలో గల జేయన్సీ కాలనీలో హనుమాన్ ఆలయం వద్ద శనివారం హనుమాన్ జన్మోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా రుద్రూర్ ఎస్సై సాయన్న చేతుల మీదుగా ధ్వజస్తంభాన్ని   ప్రతిష్టాపించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  భక్తులకు అన్నదాన కార్యక్రమం అన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్సై సాయన్నకు శాలువా తో ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు శివప్ప, యువరాజ్ అప్ప, ఆలయ  కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article