23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

తమ్ముడిని చంపిన అన్నఅరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : ఈ నెల 19న రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో జరిగిన హత్య కేసులో ఒకరిని పోలీసుల బుధవారం అరెస్ట్ చేశారు. భూతగాదాల కారణంగా తమ్ముడిని సొంత హత్య చేసినట్లు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి కథనం ప్రకారం.. రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు పొక్కిలి కిష్టయ్య, రవి మధ్య గత ఏడాదికాలంగా భూమి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో కిష్టయ్య, అతని భార్య సత్తవ్వ, కొడుకు కిషన్ కలిసి రవిని హత్య చేయాలని కుట్ర పన్నారు. రవిని హత్య చేయడానికి దోమకొండకు చెందిన షేక్ అజీజ్, చాకలి నర్సోళ్ల నరేష్ కు సుపారీ ఇచ్చి ఈ నెల 19న పథకం ప్రకారం రవిని హత్య చేశారు. విచారణలో ఈ ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ రామన్, ఎస్సై నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article