బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్ లో గణపతి నవరాత్రుల సందర్భంగా శివశంకర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపం ముందర యువతీ యువకులు సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ యూత్ సభ్యులు, నగర ప్రజలు పాల్గొన్నారు.