28.8 C
Hyderabad
Monday, August 3, 2026

హమాలీలు డబ్బులు డిమాండ్ చేశారని కోపంతోనే ధాన్యం కుప్పకు నిప్పంటించా…

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ భిక్కనూరు : గత 20 రోజులుగా రోడ్డుపై దాన్యం పోసి కాంటా చేయమంటే చేయకుండా హమాలీలు డబ్బులు డిమాండ్ చేయడంతోనే కోపంతో ధాన్యం కుప్పకు  నిప్పంటించానని రైతు రమేష్ అన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో ధాన్యం కుప్పకు  నిప్పుఅంటించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే భిక్కనూరు గ్రామంలోని గిద్ద హరిజనవాడకు చెందిన కుశలకంటి రమేష్ తనకున్న ఎకరం పొలంలో పండించిన ధాన్యాన్ని  భిక్కనూరు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి రోడ్డుపై దాన్యాన్ని ఆరబెట్టాడు. ఎన్ని  రోజులైనా తన ధాన్యాన్ని  హమాలీలు కాంట చేయకుండా  1000 రూపాయలు  డిమాండ్ చేశారని నేనెందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే డబ్బులు ఇవ్వకపోతే  ఇచ్చేవరకు  రోడ్డుపైనే ఉంటాయని చెప్పారని దింతో కోపంతో నా ధాన్యం కుప్పకు  నిప్పంటించానని తెలిపాడు. కాగా ఈ సంఘటన జరిగిన గంటలోపే విండో చైర్మన్ భూమయ్య అక్కడికి చేరుకునే రమేష్ ధాన్యాన్ని కాంటా చేయించినట్లు తెలిపారు.

More articles

Latest article