27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్లాస్టిక్ వ్యర్ధాల తొలగింపు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: శ్రీరాం సాగర్ జలాశయం నుండి ఇందిరమ్మ వరద కాలువ ద్వారా బూరుగు చెరువు, అభికుంట ,ఊర చేరువు,పాలెం నల్ల చెరువు,తొర్తీ గ్రామం(4 గొలుసు కట్టు చెరువులు)కు సాగు నీరు అందించే కి మి 18.70 తూము లోకి చేరిన ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారంను శుక్రవారం డిపార్ట్మెంట్ లస్కర్లు పూర్తిగా తొలగించారు.  ఈ తూము ద్వారా నాలుగు చెరువుల కింద 321 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించబడుతుందని అధికారులు పేర్కొన్నారు. చెరువుల సాగు నీరు అందించే తూముల నిర్వహణ కొరకు సాగునీటి శాఖ అధికారులకు మోర్తాడు మండలంలోని పాలెం గ్రామ రైతులు పూర్తి సహకారం అందించినందుకు అధికారులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article